'Avatar 2' ప్రీమియర్ చూడలేని పరిస్థితి‌లో కామెరూన్

సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'అవతార్-2'. ఈ నెల 16న దేశ వ్యాప్తంగా విడుదల కానుంది.

Update: 2022-12-13 06:47 GMT

దిశ, సినిమా : సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'అవతార్-2'. ఈ నెల 16న దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అంతేకాదు ఇవి రికార్డు స్థాయిలో ఉన్నాయి. రోజుకూ రెండు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోగా, వీకెండ్‌ రోజుల్లోని షో లకు 4.10 లక్షల టిక్కెట్లు అమ్ముడు పోయాయి. కేవలం అడ్వాన్స్ బుక్కింగ్స్‌ ద్వారానే దేశవ్యాప్తంగా రూ.7 కోట్లు వసూలైనట్టు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 'కేజీఎఫ్-2'.. 'బాహుబలి-2' చిత్రాలు కూడా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడదే స్థాయిలో 'అవతార్-2' రాబట్టింది.

ఇక శని, ఆదివారాల్లో ఈ సినిమా ప్రదర్శనలకు 4.10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. దీని ప్రకారం.. రూ.16 కోట్లు వసూలైనట్టు అంచనా. కేవలం అడ్వాన్స్ బుక్కింగ్స్‌ల ద్వారానే ఈ చిత్రం రూ.80 కోట్ల మేరకు వసూలు చేసే అవకాశం ఉంది. విచారకరమైన విషయం ఏమిటంటే ఆశాజనకమైన అంచనాలతో మరో నాలుగు రోజుల్లో థియేటర్స్‌లోకి ఈ సినిమా రానుండగా చిత్ర సృష్టికర్త జేమ్స్ కామెరూన్‌కి ఊహించని షాక్ తగిలినట్టయింది. మూవీ రిలీజ్‌కి ముందు హాలీవుడ్‌లో గ్రాండ్ ప్రీమియర్స్‌ని ప్లాన్ చేయగా సరిగ్గా అదేరోజు అతనికి కొవిడ్ పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆ రోజు ప్రీమియర్స్‌కు అతను దూరమైనట్టు తెలుస్తోంది. ఇలా జరగడంవల్ల అతని ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయినట్టు సమాచారం.

Read More....

జపాన్‌లో RRR ఘనత.. రజనీకాంత్ రికార్డు బ్రేక్ 

Tags:    

Similar News