సెక్స్ కోరికలతో ప్రేమను తిరస్కరిస్తున్నారు.. యాంకర్ రష్మీ షాకింగ్ పోస్ట్!
జబర్దస్త్ షోతో బుల్లితెరపై మంచి పేరు సంపాదించుకుంది యాంకర్ ‘రష్మీ గౌతమ్’.
దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షోతో బుల్లితెరపై మంచి పేరు సంపాదించుకుంది యాంకర్ ‘రష్మీ గౌతమ్’. ఈ భామ అందం, నటన, అద్భుతమైన డాన్స్‌తో వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. తాజాగా రష్మీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన పోస్ట్ నెటిజన్లకు షాక్ ఇచ్చింది. అందులో సెక్స్, డేటింగ్ గురించి బోల్డ్‌గా ఉంది. డేటింగ్ సాంప్రదాయం వల్ల మానవ సంబంధాలు ఎలా దెబ్బ తింటున్నాయో వివరించే ఓ దృశ్యాన్ని రష్మీ పోస్ట్ చేసింది. శృంగార పరమైన దృశ్యాలు ఒక సైకిల్లా ఉన్న ఆ పిక్‌లో ‘‘డేటింగ్ సంప్రదాయం వల్ల ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. సంబంధాలు, వావి వరసల గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ శృంగారాన్ని అనుభవించడంలో బిజీగా ఉన్నారు. దేవుడు నిజమైన ప్రేమని పొందండని, మంచి మార్గంలో పంపిస్తే, రాక్షసత్వమైన సెక్స్ కోరికలతో ప్రేమను తిరస్కరిస్తున్నారు. విషపూరితమైన సంబంధాలు ఒక సైకిల్లా మన చుట్టూ ఉన్నాయి.’’ అంటూ అందులో ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.