రాజకీయాల్లోనూ కృష్ణంరాజు చెరగని ముద్ర
టాలీవుడ్‌లో విలక్షణ నటుడు ఎవరంటే అందరికీ గుర్తొచ్చేది రెబల్ స్టార్ కృష్ణంరాజు. కెరీర్ ప్రారంభంలో విలన్‌గా పాత్రలు చేస్తూ.. స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో విలక్షణ నటుడు ఎవరంటే అందరికీ గుర్తొచ్చేది రెబల్ స్టార్ కృష్ణంరాజు. కెరీర్ ప్రారంభంలో విలన్‌గా పాత్రలు చేస్తూ.. స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. వినూత్న కథలను తెరపైకి తీసుకొస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అనంతరం రాజకీయరంగ ప్రవేశం చేశారు. రాజకీయాల్లోనూ హైట్స్ చూశారు. బీజేపీలోకి చేరిన కృష్ణంరాజు, వాజపేయీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు. కేటాయించిన శాఖలో తనదైన మార్క్ చూపించారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చివరి రోజుల్లో రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలు చేశారు. చివరగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో నటించి మరోసారి సత్తా చాటారు. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినిమా ప్రవేశం చేసిన రెబల్ స్టార్, 187కు పైగా చిత్రాల్లో నటించారు.
Also Read : కృష్ణంరాజు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
ఇవి కూడా చదవండి
రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ ప్రస్థానం.. ఫస్ట్ హిట్ సినిమా ఇదే!