ఇండస్ట్రీని షేక్ చేస్తోన్నయంగ్ హీరోయిన్ల అసలు వయస్సు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

పట్టుమని పాతికేళ్లు నిండకుండానే పలువురు యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీలో స్టార్ గుర్తింపు దక్కించుకున్నారు.

Update: 2024-05-17 15:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: పట్టుమని పాతికేళ్లు నిండకుండానే పలువురు యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీలో స్టార్ గుర్తింపు దక్కించుకున్నారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లకు సైతం గట్టిపోటీ ఇస్తూ.. వరుస చిత్రాలతో దుమ్మురేపుతున్నారు. ఏ థియేటర్ కు వెళ్లినా ఈ ముద్దగుమ్మలు బాక్సాఫీసును ఓ ఊపు ఊపుతున్నారు. నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ హీరోయిన్లైన కృతి శెట్టి, శ్రీలీల, నేహా శెట్టి, అవికా గౌర్ తో పాటు పలువురు యంగ్ హీరోయిన్స్ అసలు వయసు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరీ ఈ బ్యూటీల రియల్ ఏజ్ ఎంతో ఇప్పుడు చూద్దాం.. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి వయసు-20 సంవత్సరాలు మాత్రమే. ఇక టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల వయసు-22. డీజే టిల్లు మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న రాధికక్క (నేహా శెట్టి) వయసు-24, ప్రియా వారియర్ వయసు- 23, అవికా గోర్ ఏజ్-26, అనికా, 19 ఏళ్లు. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన రితికా నాయక్ ఏజ్ 23 ఏళ్లు మాత్రమే.   


Similar News