Kangana Ranaut: నా సినిమా కోసం పోరాటం చేయడానికి ఎక్కడికి వెళ్లడానికైనా రెడీ: కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అందరికీ సుపరిచితమే. ఆమె రాజకీయాల్లో రాణిస్తూనే పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అందరికీ సుపరిచితమే. ఆమె రాజకీయాల్లో రాణిస్తూనే పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రజెంట్ కంగనా చేస్తున్న తాజా చిత్రం ఎమర్జెన్సీ. ఈ మూవీ దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. కంగనా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తుంది. అయితే ఎమర్జెన్సీ మూవీ షూటింగ్ పూర్తయింది. కానీ కొన్ని కారణాల వల్ల రెండు సార్లు విడుదల వాయిదా పడింది. అయితే ఎమర్జెన్సీని సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ అయింది.
ఈ క్రమంలోనే మేకర్స్ ట్రైలర్ విడుదల చేసి చిక్కుల్లో పడ్డారు. ఇందులోని కొన్ని సీన్స్‌పై పంజాబ్ ఫరీద్ కోట్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలోనూ ఈ సినిమా విడుదల నిషేధం విధించే అవకాశాలున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా కంగనా సినిమా కోసం కోర్టుకు వెళ్లడానికి కూడా రెడీ అని కామెంట్స్ చేసింది. ‘‘మా టీమ్‌తో సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెళ్తే కొందరు డ్రామా క్రియేట్ చేశారు. నేను సెన్సార్ బోర్డును నమ్ముతున్నాను కాబట్టి తొందరలోనే ఎమర్జేన్సీ సెన్సార్ కంప్లీట్ అవుతుందని భావిస్తున్నాను. కానీ వాళ్లు నా సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా లేట్ చేస్తున్నారు. నేను నా చిత్రం కోసం పోరాటం చేయడానికి కోర్టు వరకే కాదు ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది.