Mr. Bachchan: మాస్ జాతర షురూ.. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ లాక్

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'.

Update: 2024-07-21 11:28 GMT

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నందున రెగ్యులర్ అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్నారు మూవీ టీమ్.

ఈ క్రమంలోనే ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ క్లాసికల్, లవ్లీ కంపోజిన్‌తో పాటు బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ మధ్య స్టీమీ రొమాన్స్‌తో విశేషంగా అలరించి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో భాగంగా తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ మూవీ ప్రీమియర్ షోలు ఆగస్టు 14న జరగనున్నట్లు తెలిపారు. కాగా.. ఆగస్టు 19న (సోమవారం) రక్షా బంధన్ హాలీడేతో పాటు మొత్తం 5 రోజుల లాంగ్ వీకెండ్‌ను ఉపయోగించుకోవచ్చనే ప్లాన్‌తో ఆగస్టు 15 కి రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వీకెండ్స్ కలిసొస్తే రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫార్మ్ అంటూ పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

Tags:    

Similar News