MR Bachchan OTT: ర‌వితేజ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ మూవీ ఆ ఓటీటీ లోనే స్ట్రీమింగ్ .. ?

ర‌వితేజ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ మూవీ ఆ ఓటీటీ లోనే స్ట్రీమింగ్

Update: 2024-08-15 08:09 GMT

 దిశ, సినిమా : మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన సినిమా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌. హరీశ్ శంక‌ర్ డైరెక్షన్ వహించిన ఈ మూవీలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌ గా నటించింది. భారీ అంచనాలతో ఈ మూవీ నేడు థియేటర్లలో సందడీ చేస్తుంది. 

ఎక్కడా చూసిన సినిమాకి పాజిటివ్ టాక్ వినబడుతోంది. సినిమా రిజల్ట్ ప‌క్క‌న బెడితే తాజాగా ఈ రోజు ఉదయం నుంచి ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ సినిమాకి సంబందించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఏ ఓటీటీలోకి వస్తుందో అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఓటీటీ హ‌క్కుల‌ను ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే, ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడన్న‌ది తెలియాల్సి ఉంది.

ఈ మధ్య థియేటర్లోకి వచ్చిన సినిమాలు అంతంత మాత్రంగా ఆడుతుండటంతో రిలీజైన రెండు నుంచి మూడు వారాల్లోనే ఓటీటీలో సందడీ చేస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో మిస్ట‌న్ బ‌చ్చ‌న్ మూవీ కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే, రిలీజ్ చేసే డేట్ తెలియాలంటే అధికారిక ప్రకటన వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. 

Tags:    

Similar News