‘ఆదిపురుష్’ను వదలని వివాదాలు .. రావణుడి గెటప్పై విమర్శలు
ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా లెవల్ లో రిలీజైన ఆదిపురుష్ ను వివాదాలు వదలడం లేదు.
దిశ, వెబ్ డెస్క్: ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా లెవల్ లో రిలీజైన ఆదిపురుష్ ను వివాదాలు వదలడం లేదు. రామాయణం గాథను ఆధారంగా తీసిన ఈ సినిమాలో గెటప్, డైలాగ్స్, సీన్స్ అసభ్యకరంగా ఉన్నాయంటూ కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సీతను తాళ్లతో కట్టి రావణుడు తీసుకెళ్లిన దృశ్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయణంలో అలా ఎక్కడా లేదని, చరిత్రను వక్రీకరించేలా ఆ దృశ్యం ఉందని వారు మండిపడుతున్నారు. అలాగే రావణుడి గెటప్ విషయంలో కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
సర్పాలతో రావణుడు మసాజ్ చేసుకుంటున్న సీన్ ను తొలగించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. ఆదిపురుష్ మూవీ మేకర్స్ కు రామాయణం గురించి ఏమాత్రం అవగాహన లేదని హిందూవాదులు మండిపడుతున్నారు. కాగా తాము పూర్తిగా రామాయణాన్ని ఆధారంగా చేసుకొని సినిమా చేయలేదని, అదే విషయాన్ని డిస్ క్లెయిమర్ లో చెప్పామని ఆదిపురుష్ రచయిత అన్నారు. కాగా అభ్యంతరకరంగా ఉన్న కొన్ని డైలాగులను తొలగిస్తామని ఆదిపురుష్ టీమ్ ఇప్పటికే ప్రకటించగా.. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల వసూళ్లతో ఆదిపురుష్ దూసుకుపోతోంది.
ఇవి కూడా చదవండి:
Adipurush:‘ఆదిపురుష్’లో పాముల మసాజ్.. ఓం రౌత్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్