కాబోయే భర్త VD లాగా ఉండాలంటూ రష్మిక పోస్ట్.. ఆ స్టార్ హీరోతో రిలేషన్ కన్ఫామ్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కిరిక్ పార్టీ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగశౌర్య చలో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కిరిక్ పార్టీ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగశౌర్య చలో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ పెంచుకుంది. ఇటీవల యానిమల్‌లో ఎన్నడూ లేని విధంగా బోల్డ్ సీన్స్‌లో నటించి షాకిచ్చింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది.
అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుంది. ఈ క్రమంలో తాజాగా, రష్మిక కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ పేరుతో ఉన్న ట్విట్టర్‌లో.. ‘‘ రష్మికకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిఫికేషన్? ఆమె ఇండియాకే నేషనల్ క్రష్. కాబట్టి రష్మికకు కాబోయే భర్త చాలా స్పెషల్. ఆయన VD లాగా ఉండాలి. అంటే.. వెరీ డేరింగ్.. ఎల్లప్పుడూ తనకు రక్షణగా ఉండాలి. తనని మేము మహారాణి అని పిలుస్తాము. అందుకే తన భర్త కచ్చితంగా రాజులా ఉండాలి’’ అని రాసుకొచ్చిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అది చూసిన రష్మిక స్పందించింది. ‘‘అలాగే ఉండాలి అది నిజమే’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా స్మైల్ ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు కొందరు VD అంటే విషయం దేవరకొండతో రిలేషన్ కన్ఫామ్ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం VD అంటే వరుణ్ ధావన్ కావొచ్చు అని కామెంట్స్ చేస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
What qualities should one have to become #RashmikaMandanna's husband?
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) February 26, 2024
She is National Crush of India
Her husband must be special.
Her husband should be like VD.
I mean Very Daring 💪 Who can protect her.
We call her a queen 👸 then her husband should also be like a king 👑 pic.twitter.com/UwC4lyHBr4