రష్మిక "డీప్‌ఫేక్" వీడియో చేసిన ప్రధాన నిందితుడు అరెస్ట్
ఢిల్లీ పోలీసులు డీప్‌ఫేక్‌కి పాల్పడ్డ వ్యక్తిని ఎట్టకేలకు ఈ రోజు పట్టుకున్నారు.
దిశ, సినిమా: గతేడాది నవంబర్‌లో రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనకి తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజ్ చేస్తున్న విధంగా కనిపించింది. కానీ దీని ఒరిజినల్ వీడియో జరా పటేల్ అనే బ్రిటిష్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ది. డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా జరా పటేల్ ముఖాన్ని రష్మికగా మార్చేసారు. ఈ వీడియో నిమిషాల్లోనే బాగా వైరల్ అయింది. ఇది చుసిన సెలబ్రిటీలు మండిపడ్డారు. ఆమెకు మద్దతుగా నిలిచి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న చర్యలు తీసుకోవాలని కోరారు
దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు డీప్‌ఫేక్‌కి పాల్పడ్డ వ్యక్తిని ఎట్టకేలకు ఈ రోజు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి ఈ వీడియో తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని ఏపీలో అరెస్టు చేసారు. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.