Rashmika Mandanna : మూడోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక..

ఇప్పుడు మూడోసారి ఇదే సీన్ రీపీట్ కావడంతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది

Update: 2024-08-19 03:48 GMT

దిశ, సినిమా : ఈ మధ్య రెప్పపాటులోనే టెక్నాలజీ మారిపోతుంది. ఎందుకంటే, మనం చేయని పనులు కూడా మార్చి చేసినట్టు మార్చి క్రియోట్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన చాలా మంది జీవితాలు నాశనమవుతున్నాయి. టెక్నాలజీని మంచి కోసం వాడేవారు ఎంత మంది ఉన్నారో చెడు కోసం వాడుకునే వారు కూడా అలాగే ఉన్నారు. ఇటీవలే డీప్ ఫేక్ తో అనేక మంది నటీ నటులు ఇబ్బందులు పడ్డారు. వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా ఒకరు. తాజాగా, మళ్ళీ ఆమె ఫొటోతో డీప్ ఫేక్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే రెండు సార్లు ఈ సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు మూడోసారి ఇదే సీన్ రీపీట్ కావడంతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో బ్లాక్ బికినీ వేసుకున్న అమ్మాయికి రష్మిక ఫేస్ ను యాడ్ చేశారు. ‘Priti Rajput’ అనే ఫేస్ బుక్ ఐడీ లో ఈ వీడియోను షేర్ చేసారు. ఇది చూసిన వారందరూ రష్మిక ఏంటి బికినీ లో ఉందని షాక్ అయ్యారు. ఆ తర్వాత తెలిసింది అసలు నిజం. ఈ వీడియో పై రష్మిక అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఎంతోమంది ఈ సమస్యను ఫేస్ చేసారు అయినా ఇంత వరకు సరైన కఠిన చర్యలు తీసుకోలేదు అమ్మాయిల మీద ఇలా దారుణంగా డీప్ ఫేక్ వీడియోస్ చేస్తుంటే.. మీరు చూస్తూ ఎలా ఉంటున్నారంటూ పోలీసులు మీద ప్రజలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News