తొలిసారి ఆ క్యారెక్టర్లో నటించనున్న రష్మిక.. షాక్‌లో ఫ్యాన్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ‘పుష్ప’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ‘పుష్ప’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ బ్యూటీ ‘పుష్ప 2’తో బిజీగా ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. అయితే.. ఇప్పటి వరకు గ్లామర్ పండిస్తూ వచ్చిన ఈ రష్మిక ఇప్పుడు రూట్ మార్చి అందరిని భయపెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే రష్మిక ఓ హిందీ మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ అనే సినిమా కోసం జోడీ కట్టేందుకు సిద్ధం అవుతోంది.
Munjya ఫేం ఆదిత్య సర్పొట్దర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఇక తాజా సమాచారం మేరకు.. ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ మూవీ రెండు టైమ్ లైన్స్ ఆధారంగా ఉండబోతుందట. వీటిలో ఒకటి విజయ నగర సామ్రాజ్యంలోని హంపి సిటీ కాగా.. రెండోది నార్తిండియాలోని ఓ చిన్న కుగ్రామం. ఇందులో రష్మిక డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నేషనల్ క్రష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.