Rashmika Mandanna: ఆ టైంలో ఏడుస్తూ ఇంటికి వెళ్లేదాన్ని.. రష్మిక షాకింగ్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ‘పుష్ప’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ‘పుష్ప’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ బ్యూటీ ‘పుష్ప 2’తో బిజీగా ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. అయితే.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కెరీర్ స్టార్టింగ్‌లో అనేక విమర్శలు ఎదుర్కొందట ఈ అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. ‘కెరీర్ స్టార్టింగ్‌లో ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి వెళ్లేదాన్ని. ఒక సినిమాలో అయితే.. సెలక్ట్ అయిన తర్వాత రెండు, మూడు నెలల పాటు వర్క్‌షాప్స్ జరిగాయి. తర్వాత ఆ సినిమా రద్దు అయింది. ఆ తర్వాత ఏకంగా పాతిక ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయ్యాను. నా నటనపై వాళ్లకు నమ్మకం ఉండేది కాదు. అలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
Read More..
Regina Cassandra: పెళ్లి చేసుకున్న రెజీనా కాసాండ్రా.. మెడలో తాళిబొట్టు ఫొటోలు వైరల్