Rashmika Mandanna: ఆయన అలా పిలవడం నాకు నచ్చలేదు.. రష్మిక

Rashmika Mandanna Doesn't like The Way Ranbir Kapoor Calls Her| నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ కలయికలో వస్తున్న తాజా చిత్రం 'యానిమల్'.

Update: 2022-06-11 07:08 GMT

దిశ, సినిమా: Rashmika Mandanna Doesn't like The Way Ranbir Kapoor Calls Her| నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ కలయికలో వస్తున్న తాజా చిత్రం 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ మనాలీలో ముగిసింది. ఈ సందర్భంగా తన అభిమానులతో ముచ్చటించిన రష్మిక.. రణ్‌బీర్‌ కపూర్‌ను మొదటిసారి కలసినప్పుడు నెర్వస్‌గా ఫీల్ అయ్యానని చెప్పింది. అలాగే అతను చాలా మంచివాడని, ఐదు నిమిషాలకే మంచి సాన్నిహిత్యం ఏర్పడిందన్న నటి.. సందీప్, రణ్‌బీర్‌లతో పనిచేయడం అద్భుతంగా ఉందని వెల్లడించింది. ఇక సినీ ఇండస్ట్రీలో రణ్‌బీర్ ఒక్కడే మేడం అని పిలవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్న రష్మిక.. ఆయన అలా పిలవడం ఇష్టంలేదని చెప్పింది. ఇక ఈ చిత్రాన్ని టి-సిరీస్, సినీ 1 స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా 2023 ఆగస్టు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది.


టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య

Tags:    

Similar News