ఆ మాటలు నన్ను మానసికంగా వేధిస్తున్నాయి : Rashmika Mandanna
బ్యూటిఫుల్ రష్మిక మందన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దిశ, సినిమా : బ్యూటిఫుల్ రష్మిక మందన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు తనను ట్రోల్ చేసేందుకు వినయోగించే పదాలు మెంటల్‌గా ఎఫెక్ట్ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 'జనాలకు నా బాడీతో ప్రాబ్లమ్ ఉంది. ఎక్కువ వర్కౌట్ చేస్తే అబ్బాయిలా కనిపిస్తున్నానని అంటారు. తక్కువ చేస్తే ఫ్యాట్ అవుతున్నావని బాడీ షేమింగ్ చేస్తారు. ఓపెన్‌గా మాట్లాడితే అతి చేస్తుందంటారు. తక్కువ మాట్లాడితే యాటిట్యూడ్ అని తిట్టిపోస్తారు. నేను శ్వాస తీసుకున్నా కష్టమే.. తీసుకోకపోయినా కష్టమే. సో నేను ఏం చేయాలి? వెళ్లిపోవాలా? లేక ఉండాలా? క్లారిటీ ఇవ్వండి' అని కోరింది. కాగా రష్మికకు సపోర్ట్ చేస్తున్న అభిమానులు ఆమెను అంత అసహ్యించుకోవడం కరెక్ట్ కాదంటున్నారు.
ఇవి కూడా చదవండి : 'బింబిసార' మాదిరిగానే మెప్పించనున్న 'సువర్ణ సుందరి'