విజయ్‌ దేవరకొండ పెళ్లికి రష్మిక మందన్నా డాన్స్‌.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

రౌడీ హీరో విజయ్ దేవర కొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్లు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటోంది.

Update: 2024-03-12 12:40 GMT

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవర కొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్లు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటోంది. వాళ్లు ఎన్నిసార్లు స్పందించి మేము ఇద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినప్పటికీ కూడా పుకార్లకు మాత్రం బ్రేకులు పడలేదు. అంతే కాదు.. వాళ్లిద్దరి జంటకు స్పెషల్ ఫ్యాన్స్ ఫోర్స్ కూడా ఉంది. ఇక రష్మిక, విజయ్ కలిసి ఇంకా ఎన్నో సినిమాలు చేస్తే బాగుండూ అనుకునే వాళ్లు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా విజయ్ నటిస్తున్న సినిమాలో రష్మిక స్పెషల్ అట్రక్షన్‌గా కనిపించ నుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విషయాల్లోకి వెళితే..

రౌడీ హీరో విజయ్ దేవర కొండ, అందాల బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ్ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకోగా.. తాజాగా సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘కళ్యాణి వచ్చా వచ్చా’ అనే పాట ప్రోమోని విడుదల చేస్తూ.. ఈ రోజు పూర్తి పాటని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే.. ఈ సాంగ్ ప్రోమో చూస్తే మృణాల్, విజయ్ పెళ్లి బట్టల్లో ఉన్నారు. అంటే ఇది సినిమాలో పెళ్లికి సంబంధించిన సాంగ్ అని అర్థం అవుతోంది. ఇప్పుడు రిలీజ్ చెయ్యబోయో ఈ ఫుల్ సాంగ్‌లో రష్మిక కూడా ఉండనుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పాటలో మృణాల్‌, విజయ్‌ల పెళ్లి సన్నివేశాలు చూపించగా.. అందులో రష్మిక డాన్సు చేస్తుందని టాక్. అంటే విజయ్‌ పెళ్లికి రష్మిక డాన్సు అన్నమాట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో అయ్యో పాపం రష్మిక అంటున్నారు నెటిజన్లు. 


Similar News