దాన్ని తలకెక్కించుకుంటే ముందడుగు వేయలేం.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్
యంగ్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి సత్తా చాటింది. ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా యువత గుండెల్లో చోటు సంపాదించుకున్నది. ఇటీవలే రణ్‌బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చిన యానిమల్ చిత్రంలో నటించి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రం దాదాపు 900 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం మొత్తం పాన్ ఇండియ వెయిట్ చేస్తోన్న పుష్ప-2 చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. సక్సెస్, ఫెయిల్యూర్స్‌పై షాకింగ్స్ కామెంట్స్ చేసింది. సినిమా రంగంలోనే కాదు.. ఏ రంగంలోనైనా ఓటములు అనేవి సహజం అన్నారు. విజయాన్ని ఎప్పుడూ తలకు ఎక్కించుకోకూడదు. అలా చేస్తే మనం మరో ముందడుగు వేయలేం అని రష్మిక చెప్పుకొచ్చింది. గర్వం పెంచుకున్న క్షణం మనం పతకానికి పునాదులు వేసుకున్నట్లే అని వెల్లడించింది. రష్మిక మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.