అందరి ముందు నూకరాజుని చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ.. అసలు ఏమైందంటే?
జబర్దస్త్ షో ద్వారా బుల్లి తెరకు పరిచయమైన రష్మీ అందరికీ సుపరిచితమే. ఈ కార్యక్రమం ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ పలు సినిమాలు కూడా చేసి అలరించింది.
దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా బుల్లి తెరకు పరిచయమైన రష్మీ అందరికీ సుపరిచితమే. ఈ కార్యక్రమం ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ పలు సినిమాలు కూడా చేసి అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై వరుస షోలు చేస్తున్నది. అయితే ఇటీవల ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌కి చెక్ పెట్టి జబర్ధస్త్‌ని రెండు రోజుల పాటు ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే.
దీనిలో భాగంగా తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో రష్మి.. నూకరాజుని చెప్పుతో కడతాననే సరికి అందరూ షాకయ్యారు. నూకరాజు రష్మీని చూస్తూ.. ఏం రష్మీ ఎలా ఉన్నావ్ అని అడిగాడు. దానికి 'నేను బాగానే ఉన్నాను కానీ ఏంటి కామెడీ వుంటుందా? అని రష్మీ ప్రశ్నించింది. అప్పుడు నూకరాజు ఏమి వినబడనట్టు యాక్ట్ చేశాడు. దీంతో మరోసారి 'స్కిట్టులో కామెడీ వుంటుందా' అని మళ్ళీ ప్రశ్నించింది. మళ్లీ ఏం వినపడనట్టే చేసి.. 'ఆ' అంటూ నూకరాజు పక్కకి తిరిగాడు.
అప్పుడు రష్మీ.. 'సరే ఇటు రా ముద్దు పెడతా' అని అనడంతో అప్పుడు వస్తున్నా అని ఆశగా ఆమె వైపు రాబోయాడు నూకరాజు. దీంతో రష్మీ.. 'చెప్పు తీసుకుని కొడతా' అని సీరియస్ అవ్వడంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న కృష్ణ భగవాన్, ఖుష్బూలతో పాటు అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.