ప్రభాస్ ‘కల్కి’ మూవీపై రణ్‌వీర్ సింగ్ ఆసక్తికర పోస్ట్.. దీపిక నటన గురించి ఏం చెప్పాడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి 2898ఏడి’. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించాడు.

Update: 2024-07-03 08:52 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి 2898ఏడి’. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించాడు. ఇందులో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, దుల్కర్, విజయ్ దేవరకొండ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ నటించారు. అయితే కల్కి సినిమా జూన్ 27న థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజైన 6 రోజులకే ఈ మూవీ రూ. 600 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాగా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. అయితే ఇప్పటికే ఈ మూవీపై ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు కూడా పెట్టారు.

తాజాగా, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టా స్టోరీలో కల్కిపై ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘ కల్కి 2898ఏడి ఒక గొప్ప సినిమా. బిగ్ స్క్రీన్ మూవీ అని అంటారు. ఇండియన్ సినిమాలో చాలా బెస్ట్. నాగి సార్ టీమ్‌కు అభినందనలు రెబల్ స్టార్ రాక్స్. ప్రభాస్ ఎప్పటికీ బెస్ట్ యాక్టర్. మీరు నాలాగే అమితాబ్ బచ్చన్ అభిమాని అయితే కల్కిని మిస్ కాకండి. ఇక నా బేబీ దీపికా పదుకొణె దయ, గౌరవంతో కలిగి ఉంది. ప్రతి క్షణాన్ని ఉన్నత పరుస్తుంది. అంత శక్తి గంభీరతతో నటించింది. మిమ్మల్ని మించిన వారు లేరు. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ రణ్‌వీర్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సూపర్ అంటున్నారు.

 

Tags:    

Similar News