విలన్‌గా మారిన రణ్వీర్.. రణ్‌బీర్‌పై రివేంజ్‌కు ప్లాన్
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా మూడు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే.
దిశ, సినిమా : రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా మూడు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన తొలి భాగం ‘శివ’ టైటిల్‌తో వచ్చి సక్సెస్ అందుకుంది. కాగా సెకండ్ పార్ట్ ‘దేవ్’గా రాబోతున్నట్లు సమాచారం. ఇందులో నెగెటివ్ రోల్లో హృతిక్ రోషన్ లేదా యశ్ నటిస్తారనే టాక్ రాగా దేవ్ క్యారెక్టర్లో రణ్వీర్ సింగ్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే అయాన్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉండగా.. రణ్వీర్ ‘బైజు బవ్రా’తో బిజీగా ఉన్నాడు. దీంతో ‘దేవ్’ షూటింగ్ 2025లో మొదలు కానుందని టాక్. అదే టైమ్‌లో రణ్వీర్ ‘డాన్ 3’ కూడా చిత్రీకరణ జరగనుంది. కాగా ఫస్ట్ టైమ్ ఈ మూవీతో ఆఫ్ స్క్రీన్ కపుల్ దీపిక-రణ్వీర్, అలియ-రణ్‌బీర్ రీల్ స్క్రీన్‌లోనూ కలిసి నటించనున్నారు. ఇందులో దీపిక.. రణ్‌బీర్ తల్లి అమృతగా నటించింది.