Rani Mukerji: ఈ తరానికి ఆ ధ్యాసే లేదు.. నటీనటులపై రాణి ముఖర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఓల్డ్ అండ్ న్యూ జనరేషన్ నటీనటుల మధ్య పని వ్యత్యాసంపై రాణి ముఖర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
దిశ, సినిమా: ఓల్డ్ అండ్ న్యూ జనరేషన్ నటీనటుల మధ్య పని వ్యత్యాసంపై రాణి ముఖర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే కొత్త తరంతో పోటీపడుతున్న తమకు ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా మాట్లాడింది. ‘నిజానికి మేము దేన్ని సవాలుగా భావించేవాళ్లం కాదు. ఇప్పటికీ ఏ పాట ప్లే చేసిన దానికి తగినట్లుగా లిప్ సింక్ చేయగలను. నిద్రపోతున్నపుడు కూడా లయ తప్పకుండా పాడగలం. నా తరానికి చెందిన నటులేకాదు మాకు ముందు వారు కూడా సహజ సిద్ధంగా ఉండేవారు. మాకు ఎలాంటి అనవసరమైన ఎంపికలు ఉండేవికావు. మేము దేనికోసం చెడిపోలేదు. కుటుంబాన్ని చూసుకుంటూనే నటనలోనూ రాణించాం. మాకు చెప్పినపని చేయడం తప్పా వేరే ఆప్షన్ లేదు’ అని చెప్పింది.
అయితే ఈ రోజుల్లో నటులకు దూరం చూపులేదని, ఎప్పటిది అప్పుడే అన్నట్లు తయారయ్యారని తెలిపింది. ‘ప్రస్తుతం సోషల్ మీడియా ఎఫెక్ట్ నటీనటులపై ప్రభావం చూపుతుంది. దానివల్ల ప్రతి పనికోసం విమర్శలకు గురవుతున్నారు. అప్పుడు మేము చాలా కష్టపడి పనిచేసేవాళ్లం. దీంతో ఏదైనా తప్పు జరిగితే క్షమించి జనాలు ఆదరించేవారు. ఇప్పుడు ఆన్‌లైన్ కారణంగా ప్రతి తప్పును ఎత్తి చూపుతూ ముఖం మీదే తిట్టేస్తున్నారు’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి :
హులా హూప్ ఛాలెంజ్‌లో అదరగొట్టేసిన దీపిక.. వీడియో వైరల్
ఊహకందని రేంజ్‌లో ‘సలార్’ బిజినెస్.. నైజాంలో ఎన్ని కోట్లు పలికిందో తెలుసా?