రణ్బీర్ ‘రామాయణం’ లో సీత సాయి పల్లవి కాదట.. !
రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నప్పటికి ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోతున్నాయి.
దిశ, సినిమా: రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నప్పటికి ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోతున్నాయి. కాగా తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ మూడు భాగాలుగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో ‘రామాయణం’ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇక రణ్బీర్ కపూర్ రాముడిగా దాదాపు ఖాయం అయినప్పటకి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్, ఇక కుంభకర్ణుడు పాత్ర కోసం బాబీ డియోల్, హనుమంతుడి పాత్ర కోసం సన్నీ డియోల్ లను అనుకుంటున్నట్లు కూడా తెలిసింది. విభీషణుడి పాత్రను తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పోషించబోతున్నట్లూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే సీతగా సాయి పల్లవి నటిస్తుందన్న వార్తలు చాలా మందిలో ఆసక్తి రేపింది. ఈ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందంటూ ఆమెను సీతగా ఊహించుకుంటూ. సోషల్ మీడియాలో ఏఐ ద్వారా ఇప్పటికే చాలా ఫొటోలు కూడా క్రియేట్ చేశారు.
అయితే తాజాగా ఇప్పుడు సీత పాత్రలో మరో నటి పేరు వినపడుతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ సీత పాత్రలో నటించనుందని వార్తలు వస్తుండటం విశేషం. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటి ఈ వార్త వైరల్ అవుతుంది. కానీ ఈ రామాయణం మూవీ తొలిసారి వార్తలు వచ్చినప్పుడు రణ్బీర్, ఆలియా సీతరాములుగా నటిస్తారని అన్నారు. ఆ తర్వాత సీత పాత్ర కోసం దీపికా పదుకొనే ని సంప్రదించగా.. చివరికి సాయి పల్లవి ని ఫైనల్ చేశారని తేలింది. మళ్లీ ఇప్పుడు జాన్వీ పేరు వినపడుతుంది.