మాకు పెళ్లి చేసుకున్న ఆనందమే లేదు.. Ranbir Kapoor

దిశ, సినిమా: యంగ్ హీరో రణ్‌బీర్‌కపూర్ తన ప్రేయసి అలియా భట్‌తో వైవాహిక జీవితం గురించి ఓపెన్ అయ్యాడు..Latest Telugu News

Update: 2022-06-13 06:28 GMT

దిశ, సినిమా: యంగ్ హీరో రణ్‌బీర్‌కపూర్ తన ప్రేయసి అలియా భట్‌తో వైవాహిక జీవితం గురించి ఓపెన్ అయ్యాడు. దాదాపు ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట చివరగా ఏప్రిల్ 14న మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పెళ్లికి ముందు ఆ తర్వాత తన లైఫ్‌లో పెద్దగా మార్పులేమి చోటుచేసుకోలేదంటున్నాడు రణ్‌బీర్. 'మేము ఐదేళ్లుగా కలిసే ఉన్నాం. కాబట్టి ఇప్పుడేమి కొత్తగా అనిపించట్లేదు. హమ్మయ్యా.. పెళ్లయితే చేసుకున్నాం అనే ఫీలింగ్ తప్పా.

అయితే మాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అందుకే మ్యారేజ్ మరుసటి రోజే మేమిద్దరం ఉద్యోగానికి బయలుదేరాం. దీంతో మాకు వివాహమైందని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాం' అంటూ వివరించాడు. ఇక హాలీవుడ్‌లో నటించాబోతున్నారా అనే విషయంపై మాట్లాడుతూ.. ఇప్పట్లో అలాంటి ఆలోచనలేవి లేవని చెప్పాడు. ప్రస్తుతానికైతే 'బ్రహ్మాస్త్ర' గురించి కలలు కంటున్నానని, ఆ తర్వాత అలియా షూటింగ్ నుంచి తిరిగి రాగానే ఒక వారం ఆమెతో గడపాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు. 


Similar News