మద్యం, మాంసానికి దూరంగా ఉంటున్న రణ్బీర్.. ఎందుకో తెలుసా?
ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘రామాయణం’కోసం బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
దిశ, సినిమా: ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘రామాయణం’కోసం బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో అల్లు అరవింద్, మధు మంతెన కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కనిపించనుండగా.. సీతగా సాయిపల్లవిని ఫైనల్ చేశారు. అయితే ఇందులో శ్రీరామచంద్రమూర్తిగా నటిస్తున్న రణ్బీర్ పాత్ర పవిత్రత దృష్ట్యా సినిమా కంప్లీట్ అయ్యేవరకూ మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు హీరోతోపాటు మూవీ టీమ్ అంతా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పవిత్రంగా, భక్తితో, ప్రేమతో రామకథను తెరకెక్కించాలని దర్శకుడు నితేశ్ భావిస్తున్నాడని ఆయన సన్నిహితులు వెల్లడించినట్లు సమాచారం. ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.