తన ఇద్దరి ప్రేమికురాళ్లకు ప్రేమను వ్యక్తపరుస్తూ రణబీర్ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి రాహా అనే కూతురు కూడా ఉంది. ఈ పాప పుట్టినప్పటి నుంచి ఈ మధ్యనే ఫేస్ చూపించారు.

Update: 2024-02-12 05:10 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి రాహా అనే కూతురు కూడా ఉంది. ఈ పాప పుట్టినప్పటి నుంచి ఈ మధ్యనే ఫేస్ చూపించారు. ఇక రణబీర్ ఇటీవల యానిమల్ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా, రణబీర్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన కూతురు, భార్యపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘మీ అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.ముందుగా నా ఇద్దరు ప్రేమికులకు హ్యాపీ వాలెంటైన్స్ డే చెబుతున్నాను. నా భార్య అలియా, నా అందమైన కుమార్తె రాహాలను నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని మిస్ అవుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. తొందరలో ప్రేమికుల దినోత్సవం ఉండటంతో ఫ్యాన్స్ మరోసారి ఈ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా రణబీర్ ప్రస్తుతం ‘రామాయణం’ సినిమాలో రాముడిగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Similar News