‘Pathan’ దెబ్బకు సౌత్ వేవ్ మొత్తానికి బ్రేక్ పడింది.. బీటౌన్ కోలుకుందంటున్న వర్మ!

షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా మొత్తం సౌత్ వేవ్‌కి బ్రేక్ వేసిందని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

Update: 2023-08-02 10:54 GMT

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా మొత్తం సౌత్ వేవ్‌కి బ్రేక్ వేసిందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఇటీవల దక్షిణాది చిత్రాలకు ఆదరణ పెరిగడంతో బాలీవుడ్ పని అయిపోయిందనే వాదనలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వెల్లడించాడు. ‘బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘పఠాన్’ ఆ పురాణాన్ని రూపుమాపింది. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ వంటి పెద్ద సినిమాలు పరాజయం పాలైన సమయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీఎఫ్’ వంటి సౌత్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. దీంతో ఇక ఏ హిందీ సినిమా సౌత్ మూవీలకు పోటీ రాలేదని, దక్షిణాదే ఇండియాను ఏలుతుందని కొందరు ఫీల్ అయ్యారు. కానీ ‘పఠాన్’ విజయం తర్వాత బీటౌన్ పరిస్థితి మెరుగుపడింది. కొంతమంది అంచనాలు తలకిందులయ్యాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా సినిమాను సౌత్, నార్త్ అనే దృష్టితో చూడకూడదని, రాజమౌళి గుజరాత్‌లో పుట్టినా, ఒడిశాలో పుట్టినా అలాంటి సినిమాలే తీసేవాడంటూ పలు విషయాలు ప్రస్తావించాడు వర్మ.

Tags:    

Similar News