చాతిపై టాటూ వేయించుకున్న రామ్ చరణ్.. ఎవరి పేరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

Update: 2024-03-20 12:50 GMT

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చరణ్ కు అదే సంవత్సరం ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అండ్ నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను అందుకున్నాడు.

తర్వాత మగధీర రచ్చ, గోవిందుడు అందరివాడేలే, నాయక్, ధృవ, ఎవడు, రంగస్థలం వంటి సినిమాల్లో నటించి బాక్సాఫీసును షేక్ చేశాడు. ప్రస్తుతం ఈ హీరో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల విషయం పక్కన పెడితే..

రామ్ చరణ్ అపోలో ఆసుపత్రి చెర్మైన్ మనవరాలైన ఉపాసనను ప్రేమించి.. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లైన 10 ఏళ్లకు క్లింకార అనే బుజ్జాయికి జన్మనిచ్చారు. అయితే చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి నచ్చకనా? మరీ ఎందుకో తెలియదు కానీ తన బాడీపై ఇప్పటివరకు ఒక్క టాటూ కూడా వేయించుకోలేదు.

సినిమాల్లో చూస్తాము కానీ బయట చరణ్ వేసుకున్న దాఖలు లేవు. తాజాగా రామ్ చరణ్ తన ఛాతిపై.. కుమార్తె క్లింకార అండ్ సతీమణి ఉపాసన.. చరణ్ ఫస్ట్ లెటర్స్ కలిపి కేయూసి అని తన ఛాతిపై టాటూ వేసుకున్నారట. చరణ్ టాటూ వేసుకున్నది ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ.. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.


Similar News