డ్రైవర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన రామ్ చరణ్

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తానేంటో నిరూపించాడు.

Update: 2022-06-07 07:17 GMT

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తానేంటో నిరూపించాడు. 'ఆర్ఆర్ఆర్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చెర్రీ.. అభిమానులు, పర్సనల్ సిబ్బంది గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. వారికి హెల్ప్ చేయడంలోనూ ముందుంటాడు. ఈ క్రమంలో చెర్రీ తన డ్రైవర్ నరేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు. తన కోసం పనిచేస్తున్న వ్యక్తిపై అభిమానాన్ని ప్రదర్శిస్తూ కేక్ కట్ చేయించాడు. ఆయన సతీమణి ఉపాసన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. తండ్రికి తగ్గ తనయుడని ప్రశంసిస్తున్నారు అభిమానులు.


Tags:    

Similar News