రామ్ చరణ్‌పై సంచలన కామెంట్స్ చేసిన ఉపాసన.. ఇష్టం లేదా?

క్రేజీ కపుల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన గురించి సుపరిచితమే.

Update: 2024-02-07 06:36 GMT

దిశ, సినిమా: క్రేజీ కపుల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన గురించి సుపరిచితమే. అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలుని చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లైన పదేళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాపాయి రాకతో మెగా ఇంట సంతోషం నెలకొంది. ఈ బుజ్జాయికి క్లీంకార అని నామకరణం చేశారు.

రీసెంట్‌గా మెగా ప్రిన్సెస్‌పై ఓ సాంగ్ కూడా క్రియేట్ చేశారు. ఈ క్రేజీ కపుల్ తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. ఇటు బిజినెస్ ఉమెన్‌గా ఉపాసన.. అటు సినిమా షూటింగ్‌లో చరణ్ దూసుకుపోతున్నారు. చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఉపాసన ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడింది.

ఈ ఇంటర్వ్యూలో ఉపాసనను.. ఏ హీరోయిన్‌తో చరణ్ కెమిస్ట్రీ బాగుంటదని యాంకర్ అడగ్గా.. ‘చరణ్ తో బెస్ట్ కెమిస్ట్రీ అంటే నాతోనే ’ అని క్రేజీ ఆన్సర్ ఇచ్చింది ఉపాసన. మీరు కాదు చరణ్ తో నటించిన హారోయిన్ పేరు చెప్పాలని అడగ్గా.. ‘నాకు తెలియదు. నేను అతడి భార్యను.. ఆ విషయం మీరు చెప్పాలి అంటుంది. ఇక యాంకర్ కాజల్ -రామ్ చరణ్ కెమిస్ట్రీ సూపర్ ఉంటుందని అంటుంది.

దీనికి ఉపాసన స్పందించి.. కాజల్ లే కాదు.. కియారా, ప్రియాంక చోప్రా, అలియా భట్, సమంతలతో కూడా చరణ్ కెమిస్ట్రీ బాగుంటుందని ఉపాసన చెప్పుకొస్తుంది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఉపాసన మాటలను బట్టి చూస్తే.. రామ్ చరణ్ హీరోయన్లతో కలిసి నటించడం ఇష్టం లేదేమో లేకపోతే క్వశ్చన్ అడగ్గానే సమాధానం చెప్పేది. అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.


Similar News