Ram Charan: ‘మగధీరుడి’కంటే ‘మల్లన్న’కేం తక్కువ.. కానీ రామ్ చరణ్‌ కారణంగానే అలా..

ఆ సినిమా తీయడానికో లెక్కుందని, కథలోనూ ఫుల్ కిక్కుందని అప్పట్లో మస్తు ప్రచారం జరిగింది.

Update: 2024-07-25 13:30 GMT

దిశ, సినిమా : ఆ సినిమా తీయడానికో లెక్కుందని, కథలోనూ ఫుల్ కిక్కుందని అప్పట్లో మస్తు ప్రచారం జరిగింది. అవినీతి, అక్రమార్కులకు హెచ్చరికలా, ప్రేక్షకులకు మంచి మెసేజ్‌లా ఉంటుంది కాబట్టి జనంలోకి వదిలితే.. ఆడియెన్స్ ఆదరణతో కాసులు కురుస్తాయని మేకర్స్‌తో పాటు అందులో నటించిన హీరో కూడా భావించాడట. కానీ అంచనాలు తారుమారయ్యాయి. మంచి పేరైతే వచ్చింది.. అనుకున్న మెసేజ్ కూడా వెళ్లింది కానీ.. కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏది అనుకుంటున్నారా? ‘మల్లన్న’.

కొందరు తమిళ నటులకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్నట్లు.. హీరో విక్రమ్‌కు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫేమ్, ఆడియెన్స్‌లో అభిమానం కూడా ఉన్నాయి. అలా ఉండబట్టే అపరిచితుడు, శివపుత్రుడు వంటి మూవీస్‌తో తెలుగుతెరపై చెరగని ముద్రవేశాడు. నేషనల్ వైడ్ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. గతంలో అలాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్న నేపథ్యంలో 2009లో రిలీజైన ‘మల్లన్న’ మూవీ కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతుందని హీరో విక్రమ్ భావించాడు. ఈ సినిమాలో అతను సీబీఐ ఆఫీసర్‌గానూ, విచిత్రమైన పక్షి ఆకారంలోనూ కనిపిస్తూ అవినీతి పరుల భరతం పట్టాడు. ఈ నటనకుగాను మస్తు ప్రశంసలు అందాయి. కానీ కమర్షియల్‌గా మాత్రం బోల్తా కొట్టింది. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ అర్థం కాలేదని విక్రమ్ అభిమానులు డిస్కస్ చేస్తుంటారు. మరికొందరు అప్పట్లో ‘మల్లన్న’మూవీ డిజాస్టర్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణే కారణమని చెప్తుంటారు. ఎందుకంటే.. 2009, జులై 30న రాంచరణ్ ‘మగధీర’ విడుదలైంది. సరిగ్గా 20 రోజులకు విక్రమ్ ‘మల్లన్న’ రిలీజైంది. కానీ అప్పటికే ప్రేక్షకుల్లో మగధీర ప్రభంజనం కొనసాగుతుండటం, అందులోనూ మెగా హీరో మూవీ కావడంతో ‘మగధీరుడి’ ధాటికి ‘మల్లన్న’ తట్టుకోలేకపోయాడు. దీంతో ‘మగధీర’ సినిమా కంటే ‘మల్లన్న’కేం తక్కువ కానీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కున్న క్రేజీ ముందు.. విక్రమ్ నిలువలేకపోయాడని కొందరు చెప్తుంటారు.

Tags:    

Similar News