అంబానీ వేడుకల్లో రామ్ చరణ్‌కు ఘోర అవమానం స్టేజ్ దిగిపోయానంటూ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా షూటింగ్ గ్యాప్ దొరకినప్పుడల్లా భార్య కూతురితో వెకేషన్స్, పలు ఫంక్షన్స్‌కు వెళ్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు మెగా హీరో భార్యతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే.
దాదాపు మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ వేడుకలు గుజరాత్‌లోని జూమ్‌నగర్‌లో జరగ్గా రామ్ చరణ్-ఉపాసన, పలువురు సినీ ప్రముఖులు వెళ్లారు. అయితే ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు సల్మాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లతో కలిసి రామ్ చరణ్ స్టెప్పు లేశాడు. అయితే స్టేజ్‌పైకి పిలిచే క్రమంలోనే చరణ్‌ను షారుఖ్ అవమానించాడని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ ఓ పోస్ట్ పెట్టింది.
రామ్ చరణ్‌కు స్టేజి పైకి పిలిచేటప్పుడు ఇడ్లీ వడ అని సంబోధించి షారుఖ్ పిలిచారు. దీంతో హర్ట్ అయిపోయాను.. కోపంవచ్చి స్టేజీ మీద నుంచి దిగిపోయాను అంత పెద్ద స్టార్‌ను అలా పిలవడం నచ్చలేదని పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన వారు షాక్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. బాలీవుడ్ హీరోలను వడపావ్, భేల్ పూరి అంటే ఊరుకుంటారా? అంటూ ఫైర్ అవుతున్నారు