Hero Ram Charan: ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీతో ఫొటో దిగిన రామ్ చరణ్.. షాకింగ్ కామెంట్ చేసిన నెటిజెన్

ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీతో ఫొటో దిగిన రామ్ చరణ్

Update: 2024-08-19 02:14 GMT

దిశ, సినిమా : ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత నుంచి రామ్ చరణ్ కెరీర్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు, ఇతనికి నటనే రాదంటూ చాలా మంది చరణ్ మీద విమర్శలు చేసారు.. నేడు అలాంటి వారికి మొఖం మీద కొట్టినట్టు ఉంది. మెగా పవర్ స్టార్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రేంజ్ వరకు ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెర్రీ తీయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా గా తెరకెక్కుతున్నాయి. ఓ వైపు సినిమా షూటింగ్ ల తో బిజీగా ఉంటూనే ఇంకోవైపు బిగ్ ఈవెంట్స్ కి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడు.

తాజాగా, ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం) 15వ ఎడిష‌న్‌లో రామ్‌చ‌ర‌ణ్ కూడా అటెండ్ అయ్యాడు. ఈ వేడుక ఆగస్టు 15 నుంచి మొదలవ్వగా 25 వరకు జ‌ర‌గ‌నుంది. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్‌ ఒక్కడే ఈ ఫెస్టివల్ కి హాజరయ్యాడు.

అయితే, ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌పంచ‌క‌ప్ 2023 డిస్‌ప్లేకు ఉంచారు. రామ్‌చ‌ర‌ణ్ వరల్డ్ కప్ పక్కన సరదాగా ఫోటోల‌కు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం, దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనిపై నెటిజెన్స్ ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరైతే అన్నా.. ప్ర‌పంచ‌క‌ప్ ను మన దగ్గరికి ప‌ట్టుకువ‌చ్చేయ్ అంటూ కామెడీగా కామెంట్ చేసాడు. దీనికి చాలా మంది రియాక్ట్ అయి మళ్ళి ఆ రోజును గుర్తు చేయకండి చాలా బాధగా ఉందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు..

Read More..

Rakhi Celebrations in Mega Family: రామ్ చరణ్-నిహారిక క్యూట్ వీడియో వైరల్ 

Tags:    

Similar News