శంకర్ దర్శకత్వంపై చెర్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న చెర్రీ.. 'నేను శంకర్ గారిని 1992 నుంచి చూస్తున్నా. శంకర్ ఫస్ట్ ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ అని రాజమౌళి అన్నారు. అలాంటి దర్శకుడి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ఈ సినిమా నుంచి నా ఫస్ట్ లుక్ ఎప్పుడూ రిలీజ్ చేస్తారని అభిమానుల్లాగే శంకర్‌ని అడుగుతున్నా. కానీ, ఆయన ఓ మార్కెటింగ్ జీనియస్.. తనకు ఎప్పుడు ఏ పని చేయాలో బాగా తెలుసు' అంటూ చెప్పుకొచ్చాడు.