చ‌ర‌ణ్‌తో మాట్లాడితేనే నా మ‌న‌సు కుదుట ప‌డుతుంది: Tamannaah Bhatia

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది

Update: 2023-08-13 09:39 GMT
చ‌ర‌ణ్‌తో మాట్లాడితేనే నా మ‌న‌సు కుదుట ప‌డుతుంది: Tamannaah Bhatia
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ఇటీవల పలు వెబ్ సీరిస్‌‌లతో పాటు వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న మాట్లాడుతూ.. ‘నాకు ఇండస్ట్రీలో క్లోజ్ అంటే కాజ‌ల్ అగ‌ర్వాల్. ఇద్దరం ముంబైలో త‌రుచూ క‌లుస్తుంటాం. కాజ‌ల్‌కు జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ ఎక్కువ‌. ఏ విష‌యంపైనైనా గ‌ల‌గ‌లా మాట్లాడేస్తుంది. ఆమేతో ఎంతసేపు మాట్లాడినా మాట్లాడ‌ల‌నిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే మాత్రం ఎంతమంది బెస్ట్ ప్రెండ్స్ ఉన్నా ఎవ‌రికీ ఫోన్ చేయ‌ను రామ్ చ‌ర‌ణ్‌కు తప్పా. అత‌ను బిజీగా ఉన్నా నా కాల్ లిప్ట్ చేస్తాడు. చ‌ర‌ణ్‌తో మాట్లాడుతుంటే అసలు టైం తెలియ‌దు. ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా చెర్రీతో మాట్లాడితే మ‌న‌సు కుదుట ప‌డుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది తమన్న. ప్రస్తుతం తమన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More:   ‘బ్రో’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Tags:    

Similar News