అందరూ దానిగురించే అడుగుతున్నారు.. త్వరలోనే ఆ పని చేస్తా: రకుల్

స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగు సినిమాలు చేయకపోవడంపై ఓపెన్ అయింది. 2021లో వచ్చిన 'కొండ పొలం' సినిమా తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చిన నటి..

Update: 2022-10-14 08:07 GMT

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగు సినిమాలు చేయకపోవడంపై ఓపెన్ అయింది. 2021లో వచ్చిన 'కొండ పొలం' సినిమా తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చిన నటి.. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. దీంతో తను టాలీవుడ్‌ను పూర్తిగా వదిలేసిందని, ఇకపై బీటౌన్‌కే పరిమితం కాబోతుందంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నటించిన 'డాక్టర్‌ జీ' ప్రమోషన్స్‌లో భాగంగా క్లారిటీ ఇచ్చిన బ్యూటీ.. 'అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. తెలుగులో సినిమా చేయలేకపోతున్నానన్న విషయం నాకు తెలుసు. కానీ త్వరలోనే టాలీవుడ్‌ సినిమా చేయబోతున్నా. తెలుగు ఫ్యాన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం వాళ్లే. వచ్చే ఏడాది ఓ పెద్ద తెలుగు సినిమా చేయబోతున్నా. అంతేకాదు మంచి ఆఫర్ వస్తే ఏ భాషలోనైనా నటించేందకు సిద్ధంగా ఉన్నా' అని క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :  ఆ అలవాట్లే కుటుంబాన్ని నాశనం చేశాయి.. స్టార్ నటి ఎమోషనల్

Tags:    

Similar News