Rakul Preet Singh :సీక్రేట్‌గా రెండుసార్లు పెళ్లి చేసుకున్న రకుల్ ?

రకుల్ ప్రీత్ సింగ్,బాలీవుడ్ నిర్మాత, నటుడు అయిన జాకీ భగ్నాని గత కొన్ని రోజుల నుంచి రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక వీరు పెళ్లి చేసుకున్నారని

Update: 2023-06-20 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రకుల్ ప్రీత్ సింగ్,బాలీవుడ్ నిర్మాత, నటుడు అయిన జాకీ భగ్నాని గత కొన్ని రోజుల నుంచి రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక వీరు పెళ్లి చేసుకున్నారని కొన్ని రూమర్స్ వస్తే, త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కాగా. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్తలపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ..మా ప్రేమ విషయాన్ని దాచడానికి మేమేం ఇంకా చిన్న పిల్లలం కాదు. అందులో మాకేం భయం లేదు. మేము దీన్ని నిర్భయంగా బయటపెట్టాం. మా ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నా కూడా చాలామంది మేం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలు వైరల్ చేస్తున్నారు.

ఇప్పటికే గత సంవత్సరం ఆగస్టులో, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలు వైరల్ చేశారు. ఇలా ఇప్పటికే సోషల్ మీడియా మాకు రెండుసార్లు సీక్రెట్ గా పెళ్లి చేసేసింది.ఇలాంటి వార్తలు చూసినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది. అంటూ తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More:    రామాయణం చేసేటప్పుడు దాని గురించి తెలుసుకోరా? ప్రభాస్‌పై హీరోయిన్ మాధవిలత సంచలన పోస్ట్  

Tags:    

Similar News