ఆ హీరోతో సినిమా మిస్ అయినందుకు బాధ పడ్డా.. రకుల్ కామెంట్స్ వైరల్
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.
దిశ, సినిమా: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇక ఇటీవల ‘భారతీయుడు 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ప్రజెంట్ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ‘దే దే ప్యార్ దే 2’ లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘నా కెరీర్ స్టార్టింగ్‌లో ఒక సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ చేశాను. ఆ ప్రాజెక్ట్ షూటింగ్ అనంతరం నా షెడ్యూల్ ముగించుకుని ఢిల్లీ వెళ్ళాను. అయితే తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి ఎటువంటి అప్‌డేట్ లేదు. కానీ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే.. ఆ ప్రాజెక్ట్‌కి నా స్థానంలో వేరే హీరోయిన్‌ను తీసుకున్నారు. అయితే ఆ సినిమాలో ప్రభాస్ హీరో అని తెలిసి చాలా బాధపడ్డాను. ఇలాంటి సంఘటనే ప్రభాస్ చేసిన మరో ప్రాజెక్ట్‌లో కూడా జరిగింది. ప్రభాస్ హీరో అనడంతో సినిమాకు నేను సంతకం చేసాను. కానీ ఇప్పటివరకు మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.