ఆకట్టుకుంటోన్న 'శశివదనే' కలర్‌ఫుల్ ప్రోమో!

ర‌క్షిత్ అట్లూరి, కోమ‌లి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ల‌వ్ అండ్ యాక్షన్ డ్రామా 'శశివదనే'.

Update: 2023-01-28 11:57 GMT

దిశ, సినిమా: ర‌క్షిత్ అట్లూరి, కోమ‌లి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ల‌వ్ అండ్ యాక్షన్ డ్రామా 'శశివదనే'. గౌరి నాయుడు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.వి.ఎస్.క‌న్‌స్ట్రక్షన్స్ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్ కంపెనీ ప‌తాకాల‌పై అహితేజ బెల్లంకొండ నిర్మించిన చిత్రానికి సాయి మోహ‌న్ ఉబ్బన ద‌ర్శకత్వం వహించాడు. కాగా ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది.

తులసి చెట్టుకు దండం పెట్టుకుంటూ శ్రద్ధగా పూజ చేసుకుంటున్న కోమలి.. ప్రియుడు ఇంటి ద‌గ్గర‌కు వ‌చ్చాడ‌ని తెలియ‌గానే ఆనందంతో మేడ పైకి ప‌రుగులు తీస్తూ మురిసిపోవడం అభిమానులను అట్రాక్ట్ చేసింది. అలాగే క‌ల‌ర్‌ఫుల్‌గా కనిపించిన ఈ ప్రోమోలో హ‌రి చ‌ర‌ణ్, చిన్మయి శ్రీపాద పాడిన పాట‌ ప్రేక్షకులను అల‌రిస్తోంది. శ్రవ‌ణ వాసుదేవ‌న్ సంగీతం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. కోన‌సీమ‌, అమ‌లాపురం త‌దిత‌ర ప్రాంతాల్లో 50 రోజుల‌కు పైగా చిత్రీక‌రించిన సినిమా టైటిల్ సాంగ్ ఫిబ్రవరి 1న రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

READ MORE

'ప్రేమదేశం' యువతను ఉర్రూతలూగిస్తుంది: శ్రీకాంత్ సిద్ధం 

Tags:    

Similar News