Raksha Bandhan: సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రాలివే

అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అని చెప్పుకోవచ్చు.

Update: 2024-08-19 07:09 GMT

దిశ, సినిమా: అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అని చెప్పుకోవచ్చు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన టాలీవుడ్ చిత్రాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని ఎన్టీఆర్ వరకు అద్భుతంగా తెరకెక్కిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి-హిట్లర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్లర్’ మూవీ అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తమ సిస్టర్స్ అందరూ మంచి ఇంటికి కోడళ్లుగా వెళ్లాలని మెగాస్టార్ తాపత్రయపడే రోల్ లో నటించారు. ఇందులో రంభ హీరోయిన్ గా నటించింది.

పవన్ కల్యాణ్- అన్నవరం

పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటించిన అన్నవరం సినిమా ఏకంగా ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీలో అన్నాచెల్లెళ్ల ప్రేమ చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

రాజశేఖర్- గోరింటాకు

గోరింటాకు చిత్రంలో మీరా జాస్మిన్- రాజశేఖర్ అన్నాచెల్లెళ్ల పాత్రలో నటించి తెలుగు ప్రజల్ని మెప్పించారు. వదిన పెట్టే కష్టాలు, చెల్లి కోసం అన్నయ్య పడే తాపత్రయం, ఆస్తి కోసం అయిన వాళ్లు చెల్లి భర్తను జైలుకు పంపడం, పుట్టింటికి వచ్చిన చెల్లెను వదిన అర్తి అగర్వాల్ అవమానించి తిరిగి పంపించడం వంటి సన్నివేశాలు కంటతడి పెట్టించాయి.

హీరో అర్జున్ -పుట్టింటికి రా చెల్లి

అన్నయ్య -చెల్లెలి సెంటిమెంట్‌ తో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుట్టింటికి రా చెల్లి. ఈ సినిమాలో అర్జున్ అండ్ నటి మధుమిత బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రల్లో నటించి ఆడియన్స్ ను కంటతడి పెట్టిస్తారు.

తారక్- రాఖీ

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమాల్లో రాఖీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు.ఈ చిత్రంలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఎన్టీఆర్ ఒక బ్రదర్ లా అందరికీ అండగా ఉంటాడు. నేడు రాఖీ సందర్భంగా ఈ మూవీస్ అన్నీ నెట్టింట ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News