ప్రియుడితో దుబాయ్‌లో రాఖీ సావంత్ రొమాన్స్..
దిశ, సినిమా: బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ భర్తకు విడాకులిచ్చి, అభిమానులకు కొత్త బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసింది.
దిశ, సినిమా: బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ భర్తకు విడాకులిచ్చి, అభిమానులకు కొత్త బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ఓపెన్‌గానే ఉండే రాఖీ.. ఇప్పుడు కూడా ప్రియుడితో గడుపుతున్న స్పెషల్ మోమెంట్స్‌ను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే న్యూ బాయ్ ఫ్రెండ్ ఆదిల్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన ఆమె.. అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసింది. తిరిగి వస్తున్న క్రమంలో ముంబై ఎయిర్‌పోర్టులో జంటగా కనిపించిన ఇద్దరు.. ఫొటోలకు పోజిచ్చారు. అయితే ఇంతకు ముందెప్పుడూ సిగ్గుపడని రాఖీ.. ఇప్పుడు బ్లష్ అవుతూ సంతోషంగా కనిపించిందని అంటున్నారు అభిమానులు. తను నిజంగా హ్యాపీగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.