Rakhi Sawant : భార్య న్యూడ్ వీడియోలు అమ్ముకున్న భర్త..
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన రెండో భర్త ఆదిల్ దురానీపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.
దిశ, సినిమా : బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన రెండో భర్త ఆదిల్ దురానీపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆదిల్ చేతిలో దారుణంగా మోసపోయానంటున్న రాఖీ.. తాజాగా మరో షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. కట్నం గురించి వేధించాడని, తన ఇమేజ్ వాడుకుని స్టార్ డమ్ పొందాలని అనుకున్నాడని గతంలో ఆరోపించిన ఆమె.. తమ ప్రైవసీని పబ్లిక్ చేశాడని చెప్పుకొచ్చింది. 'ఆదిల్ నా న్యూడ్ వీడియోలను తీసి కొంతమందికి అమ్ముకున్నాడు. శృంగారం విషయంలో నన్ను చాలా రకాలుగా హింసించాడు. ఈ కేసు ప్రస్తుతం సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. అతను చందేల్ అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటాడు' అని పేర్కొంది. అలాగే తనను చిత్ర హింసలు పెట్టిన దుర్మార్గుడికి బెయిల్ రాకూడదని కోరిన నటి.. తన నుంచి రూ.1.50 కోట్లు తీసుకున్నట్లు ఆదిల్ ఒప్పుకున్న వీడియోను లీక్ చేయడం విశేషం. కాగా చివరగా భర్త ఆదిల్ ఖాన్‌తో గొడవలు జరుగుతున్నప్పుడు షెర్లిన్ చోప్రా నుంచి తనకు చాలా మద్దతు లభించిందని రాఖీ తెలిపింది.