విడుదలకు ముందే చిక్కుల్లో Rajini Kanth ‘JAILER’ సినిమా.. హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు
సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘జైలర్’.
దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘జైలర్’. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. కన్నడ, మలయాళ సూపర్ స్టార్స్ శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 10న విడుదల కానుంది.
తాజాగా, జైలర్ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ మలయాళ డైరెక్టర్ సక్కీర్ మూడత్తిల్ ఈ సినిమాపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘‘ ఆగస్ట్ 2021లో కేరళ ఫిల్మ్ ఛాంబర్లో ‘జైలర్’ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అదే ఏడాది షూటింగ్ ప్రారంభించారు. కానీ, ఆర్థిక సమస్యల వల్ల ప్రొడక్షన్ ఆలస్యమైంది. ఈ రెండు సినిమాల స్టోరీలు వేర్వేరు అయినప్పటికీ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి టైటిల్ మార్చాలని సక్కీర్ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా, ఆగస్టు 2న హైకోర్టులో దీనిపై హియరింగ్ జరగనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి: ‘హరిహర వీరమల్లు’ నుంచి బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన నిధి.. కల నెరవేరిందంటూ
#Jailer TITLE change issue.Malayalam director Sakkir Madathil appeals to makers of #Rajinikanth's 'Jailer' to change movie title.He formally registered the title with the Kerala Film Chamber in August 2021.His film commenced production on November 6, 2021, concluded on… pic.twitter.com/ELGkbVSowg
— Manobala Vijayabalan (@ManobalaV) July 16, 2023