ఓటీటీలోకి రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రజనీ కాంత్ కూమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ లాల్ సలామ్. ఇక ఫిబ్రవరి 9(శుక్రవారం) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంతగా ప్రేక్షకులను
దిశ, సినిమా : రజనీ కాంత్ కూమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ లాల్ సలామ్. ఇక ఫిబ్రవరి 9(శుక్రవారం) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో దీన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారంట.లాల్ సలామ్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సమాచారం.భారీ ధరకు లాల్ సలామ్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ చిత్రాన్ని 60 రోజులకు స్ట్రీమింగ్ చేయనుందని టాక్ నడుస్తోంది. ఇక రజనీకాంత్ కెరీర్‌లోనే అతితక్కువ కలెక్షన్స్ ఈ మూవీకి వచ్చినట్లు సమాచారం.
కాగా, ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. వీళ్లతోపాటు భారత దిగ్గజ క్రికెటర్ కపీల్ దేవ్, జీవిత రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా, ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు.అలాగే ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.