లడ్డూ ఇష్యూపై రియాక్టైన రజినీకాంత్.. ఏమన్నారంటే?
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయన్- ద హంటర్’.
దిశ, సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయన్- ద హంటర్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషరా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో వరుస ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్నారు చిత్ర బందం.
ఈ క్రమంలోనే తాజాగా ‘వెట్టైయన్- ద హంటర్’ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ పేరుతో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. అందులో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించి అదరగొట్టాడు. ఇందులో భాగంగా తాజాగా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న రజినీ కాంత్ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ విలేకరి.. ‘తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటీ అని సూపర్ స్టార్‌ను ప్రశ్నించింది. రజినీ కాంత్ స్పందిస్తూ.. ‘సారీ.. నో కామెంట్స్’ అని సింపుల్‌గా చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.