పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాజీవ్ కనకాల, శివ బాలాజీ.. కారణం ఏంటంటే..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ పేరుతో పిల్లలు, లేడీస్ల పైనా హద్దుమీరి దారుణమైనా వ్యాఖ్యలు చేస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతుంటారు.
దిశ, సినిమా: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ పేరుతో పిల్లలు, లేడీస్ల పైనా హద్దుమీరి దారుణమైనా వ్యాఖ్యలు చేస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతుంటారు. మైయిన్గా ఆర్టిస్ట్‌లను, కుటుంబాలను టార్గేట్ చేసుకొని అతి నీచాతి నీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MMA) రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ నటులు రాజీవ్ కనకాల, శివ బాలాజీ, శివ కృష్ణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ..
" ఈమధ్య ట్రోల్స్, మీమ్స్ శృతిమించి పోతున్నాయి. మా తెలుగువారు ఇంత దిగజారిపోయి పెళ్ళాం, పిల్లలు, కుటుంబ సభ్యులపై ట్రోల్స్ చేసే సంస్కృతి ఎప్పుడూ లేదు. ఇది ఎవరికీ మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చారు.
శివ బాలాజీ మాట్లాడుతూ..
ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి కానీ ఇలా ఇబ్బంది పడేలా ఉండకూడదు. ఇక మీదట నటీనటులు మీద ఇలాంటి ట్రోల్స్ చేస్తే చేస్తే సహించేది లేదు. "సుమారు 200 యూట్యూబ్ చానల్స్ లిస్టును డిజిపికి సమర్పించాము. డిజిపి సానుకూలంగా స్పందించారు. సైబర్ సెక్యూరిటీ లోనే ఒక స్పెషల్ వింగ్ ట్రోలర్స్ పై నిఘా ఉంచుతామని తెలిపారు. దారుణమైన ట్రోల్స్‌కి పాల్పడే వారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాము" అని అన్నారు.
శివ కృష్ణ మాట్లాడుతూ..
"ట్రోల్స్ వల్ల లేడీ ఆర్టిస్ట్‌లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఆర్టిస్ట్‌ల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. కొంతమంది యూట్యూబర్స్ డబ్బు సంపాదన కోసం ఇలా చేస్తున్నారు.
పొలిటికల్ అండ్ సినిమా, జర్నలిస్ట్‌ల మీద ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. డిజిపి గారు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు." అని అన్నారు.
(video link credits to Sri venkateshwara movies youtube id)