దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా రెండో తరం స్టార్ హీరోయిన్లలో కాంచన ఒకరు. ఈ నటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. బహుబలి చిత్రాలతో రికార్డు సృష్టించిన దర్శకుడు రాజమౌళిపై సీనియర్ నటి కాంచన సీరియస్ కామెంట్లు చేశారు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన కాంచన తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను ఆడియన్స్‌తో పంచుకున్నారు. అలాగే రాజమౌళి గురించి మాట్లాడారు. ‘‘ఆ దర్శకుడు బహుబలి చిత్రంలో ఒక పాత్రలో నటించడం కోసం నన్ను అడిగారు. రెండు రోజులు మాత్రమే షూట్ ఉంటుందని చెప్పారు. అందుకోసం నేను రూ.5 లక్షలు డిమాండ్ చేయగా, అతను ఇంత చిన్న పాత్రకు అంత డబ్బు ఇవ్వడం కుదరదని చెప్పేశాడు. రూ.5 లక్షలు అంటే రాజమౌళికి పెద్ద విషయం కాదు. అంతేకాదు ఆయన చాలా కోటీశ్వరుడు కూడా. కానీ మాకు అది పెద్ద అమౌంట్. మాలాంటి వాళ్లకు ఇస్తే మేము దేవునికి సేవ చేసుకుంటాం కదా. కేవలం ఐదు లక్షల కోసం ఆయన నన్ను అవమానించి పక్కన పెట్టేశారు. ఆ సమయంలో నాతో పాటుగా మరికొందరు సీనియర్ నటులు కూడా ఉన్నారు. పాత్రలు ఇస్తే చేయగలం అంటూ ఆమె తన అసహనాన్ని బయటపెట్టారు.’’ ఈ విధంగా సినిమాల్లో నటించే వారికి కూడా అనేక కష్టాలు ఉంటాయని ఆమె మాటల్లో మాటగా చెప్పారు. అలాగే ఇలా మాట్లాడుతున్నానని ఏం అనుకోవద్దని చెప్పారు.
వ్యక్తిగత విషాయాలకొస్తే.. కాంచన పెళ్లి చేసుకోలేదు. ఆమెకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. నిత్యం దేవునికి సేవలు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఆమె తండ్రి బిజినెస్‌లో నష్టపోతే ఆమె ఎయిర్ హోస్టెస్‌గా జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారట. తను ఉద్యోగం చేస్తున్న సమయంలో కొందరి పరిచయాల వల్ల ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చినట్లు తెలిపారు. తండ్రితో కొన్నాళ్లు ఆమెకి ఆస్తి గొడవలు జరిగాయి. చాలా సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ కేసులో కాంచనకు న్యాయం జరిగింది. చెన్నై కోర్టు ద్వారా ఆమె తిరిగి పొందిన ఆస్తిని ‘తిరుమల తిరుపతి’ దేవస్థానం వారికి రాసి ఇచ్చారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఈ నటి చాలా గ్యాప్ తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండకు నానమ్మ పాత్రలో చేశారు.
Read more: