అందరిముందు రామ్ చరణ్‌ను అవమానించిన డైరెక్టర్ రాజమౌళి?

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.

Update: 2024-01-24 04:06 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదట్లో ఆరెంజ్ సినిమాలో హీరోగా నటించగా.. బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో ఏమాత్రం వెనకడుగేయకుండా.. చిరుత, మగధీర, ఎవడు, రంగస్థలం, ధృవ, నాయక్, గోవిందుడు అందరివాడేలే’ వంటి చిత్రాల్లో నటించి బాక్సాఫీసును షేక్ చేశాడు చరణ్. ఇక టాలీవుడ్ దర్శక ధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది.

బహుబలి తర్వాత ఈ సినిమాకే అంత కలెక్షన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. జూనీయర్ ఎన్టీఆర్ కు, రామ్ చరణ్‌కు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చింది. వీరి నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ముఖ్యంగా నాటు నాటు పాట అయితే ప్రపంచాన్నే ఓ రేంజ్ లో ఊపేసింది. ఈ సాంగ్ ఆస్కార్‌కి ఎంపికైంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, చంద్రబోస్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇండియా సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మొత్తానికి ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది.

అయితే ఈ చిత్రంలో తారక్-చరణ్ ఇద్దరు అగ్ర హీరోలు కావడంతో ఫ్యాన్స్.. ఎవరు గొప్ప, ఎవరి పాత్ర ఎక్కువ, ఎవరిది తక్కువని నెట్టింట చర్చించుకున్న విషయం తెలిసిందే. వీరి ఫ్యాన్స్ సోషల్‌ మీడియా వేదికగా కొట్టుకున్నారు కూడా. అయితే చాలా వరకు రామ్‌చరణ్‌ హీరో అని, తారక్ ది సపోర్టింగ్‌ పాత్ర అని చరణ్ అభిమానులు అన్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూకు హాజరై పాజిటివ్ కామెంట్స్ చేశారు.

మీడియా వారు ఆర్ఆర్ఆర్ ప్రస్తావన తీసుకురాగా.. ‘ఒకవేళ కొమురంభీముడో సాంగ్‌తోనే మూవీ ఎండ్‌ అయితే.. అప్పుడు రామ్‌ చరణ్‌ ది సైడ్‌రోల్‌ అవుతుంది’ అని జక్కన్న చెప్పుకొచ్చారు. ఈ మాటతో తారక్ ఫ్యాన్స్ కు రెక్కలొచ్చాయి. రాజమౌళి చరణ్ తక్కువ చేసి మాట్లాడారనే ఉద్దేశ్యంతో ఈ వీడియాను నెట్టింట వైరల్ చేస్తూ ఎన్టీఆర్ ను పొగిడేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు.. రాజమౌళి అంత మాట అన్నాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారు.


Similar News