Raj Tarun New Movie: తగ్గేదే లే .. నెల రోజుల్లోనే ఇంకో సినిమా రిలీజ్ చేస్తానంటున్న రాజ్ తరుణ్

లావణ్య వివాదం తర్వాత రాజ్ తరుణ్ బయటకు రాలేదు

Update: 2024-07-31 14:33 GMT

దిశ, సినిమా: లావణ్య వివాదం తర్వాత రాజ్ తరుణ్ బయటకు రాలేదు. తనపై వచ్చిన ఆరోపణలకు మీడియాకి ఒకసారి క్లారిటీ ఇచ్చి మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ రోజు తిరగబడరా సామి మూవీ ఈవెంట్ కి హాజరరై అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక మీడియా వారికీ దొరికిందే ఛాన్స్ అనుకుని అడగాల్సిన ప్రశ్నలు మొత్తం అడిగేసారు.

తర్వాత సినిమా ఏమి చేస్తున్నారన్న ప్రశ్నకి రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. నాకు తెలిసిందే ఈ వృత్తి ఒక్కటే.. ఇక నుంచి తగ్గదే లేదు బ్యాక్ టు సినిమాలు వస్తాయి. ఈ ఏడాది నా సామిరంగ మూవీలో నాగార్జున పక్కన చిన్న రోల్ చేశాను. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. జూలై 26 రిలీజ్ అయినా పురుషోత్తముడు సినిమా కూడా అన్ని సెంటర్స్ లో పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇప్పుడు తిరగబడరా సామీ మూవీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెల రోజుల్లోనే మళ్ళీ కొత్త మూవీతో వస్తాను. నా తర్వాత మూవీ ‘భలే ఉన్నాడే’ మూవీ వస్తుందని తెలిపారు. దీనిపై స్పందించిన నెటిజెన్స్ ఒక మనిషి ఎంతలా నలిగిపోకూడదో అంతలా నలిగిపోయావు నీ విజయం ఇక్కడి నుంచే మొదలవుతుందంటూ రాజ్ తరుణ్ కు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News