రాహుల్ సిప్లిగంజే ఫోటోలు లీక్ చేసాడు.. రతికని పెళ్లి చేసుకోవడానికి అలాంటి కండిషన్లు పెట్టాడు : రతిక చెల్లెలు

రతికని కావాలనే బ్యాడ్ చేశారని.. దాని వల్ల రతిక డిప్రెషన్‌లోకి వెళ్లందని కన్నీటి పర్యంతం అయ్యింది రతిక చెల్లెలు

Update: 2023-11-04 04:05 GMT

దిశ,వెబ్ డెస్క్: రతికని కావాలనే బ్యాడ్ చేశారని.. దాని వల్ల రతిక డిప్రెషన్‌లోకి వెళ్లందని కన్నీటి పర్యంతం అయ్యింది రతిక చెల్లెలు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నుంచి ఎవరికీ లేనంతంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేసారు .. కానీ నిజానికి మా అక్క అంత పెద్ద తప్పు చేయలేదని వాపోయింది రతిక చెల్లెలు. అయితే ఆ మధ్య రాహుల్ సిప్లిగంజ్, రతిక ప్రైవేటు ఫొటోలు లీక్ అయిన విషయం మనందరికి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను రతిక చెల్లెలు బయటపెట్టింది.

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌గా వెళ్లిన రతిక రోజ్.. బీభత్సమైన నెగిటివిటీతో నాలుగోవారంలోనే ఎలిమినేట్ అయ్యింది. అయితే అనూహ్యంగా ఆమెకు మరో అవకాశాన్ని ఇస్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి మళ్లీ పంపారు. ఆ దెబ్బతో ఒక్కసారిగా వీళ్లిద్దరూ మాజీ లవర్సా అనే చర్చ హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ ఇష్యూపై రాహుల్ పరోక్షంగా స్పందిస్తూ.. కొన్నేళ్ల క్రితం దిగిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయంటే.. తన ఫేమ్‌ని యూజ్ చేసుకోవడానికే అన్నట్టుగా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో రాహుల్ ఫ్యాన్స్ రతిక కావాలనే ఈ ఫొటోలను లీక్ చేసిందని ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. అయితే ఆ ఫొటోలు లీక్ కావడానికి మా అక్కకి ఎలాంటి సంబంధం లేదని.. రాహుల్ సిప్లింగంజే ఆ ఫొటోలు లీక్ చేసి ఉండొచ్చంటూ బాంబ్ పేల్చింది రతిక చెల్లెలు. అంతే కాదు.. రతికను పెళ్లి చేసుకోవడానికి రాహుల్ కండిషన్స్ కూడా పెట్టాడు.. పెళ్లి చేసుకోవాలంటే.. నువ్వు ఇండస్ట్రీలో ఉండొద్దు.. బయటకు వెళ్లడానికి వీళ్లేదని చెప్పాడు.. ఇవి మా అక్కకి నచ్చక వీరి పెళ్లి ఆగిపోయిందంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News