తన ఫస్ట్ క్రష్ పేరు చెప్పేసిన Kareena Kapoor.. ఇంతకాలం తెలుసుకోలేకపోయానంటూ హీరో పశ్చాత్తాపం..

స్టార్ నటి కరీనా కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ రాహుల్ రాయ్ అని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన రాహుల్.. నిజంగా కరీనాకు తనపై ఇంత ప్రేమ ఉందని తెలిసి ఆశ్చర్యపోయానంటున్నాడు.

Update: 2023-07-16 08:11 GMT

దిశ, సినిమా: స్టార్ నటి కరీనా కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ రాహుల్ రాయ్ అని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన రాహుల్.. నిజంగా కరీనాకు తనపై ఇంత ప్రేమ ఉందని తెలిసి ఆశ్చర్యపోయానంటున్నాడు. 1990లో వచ్చిన ‘ఆషికి’ మూవీతో భారీ ప్రజాధారణ పొందిన ఆయన.. నటీమణుల మనసులు కూడా గెలుచుకున్నట్లు గుర్తించలేదన్నాడు. ‘నేను చాలా కాలంగా కరీనాను కలవలేదు. కరిష్మాను మాత్రమే తరచుగా కలుస్తూ ఉండేవాడిని. అప్పుడపుడు కరీనా గురించి మాట్లాడుకునేవాళ్లం. అయితే నేను హీరోగా ఉన్నపుడు కరీనా కెరీర్‌ మొదలుకాలేదు. ఆమెకు నా మీద ప్రేమ ఉందని తెలియదు. ఎవరూ చెప్పలేదు’ అన్నాడు. ఇక ‘నాకు ఇష్టమైన సినిమా ‘ఆషికి’. నా మొదటి క్రష్ రాహుల్. ఆయన కోసమే ఆ మూవీకోసం 8సార్లు థియేటర్‌కి వెళ్లాను. అప్పుడే ఆయనంటే ఇష్టం పెరిగింది. ఇతరులకు చెప్పడానికి భయపడ్డాను’ అంటూ కరీనా ఓ ఇంటర్వ్యలో బహిరంగంగా అంగీకరించింది. 

Also Read: వాళ్లంతా చీ కొట్టిన క్యారెక్టర్‌ను నాకు అంటగట్టారు.. ఆడిషన్‌ కూడా చేయలేదు..

Tags:    

Similar News